Fri Nov 22 2024 17:21:57 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ అలర్ట్ : విప్ జారీ
పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీ హైకమాండ్ అప్రమత్తమయింది. నేడు మాక్ పోలింగ్ నిర్వహించనుంది
పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో వైసీపీ హైకమాండ్ అప్రమత్తమయింది. నేడు మాక్ పోలింగ్ నిర్వహించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాల్సిన తీరుపై వివరించనున్నారు. ఒక్క ఓటు కూడా ఇన్వాలిడ్ కాకుండా పార్టీ హైకమాండ్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. ప్రతి ఒక్కరూ అసెంబ్లీకి హాజరు కావాలని సూచించింది.
నేడు మాక్ పోలింగ్
ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఎట్టిపరిస్థితుల్లో టీడీపీ అభ్యర్థి గెలవకూడదని ఇప్పటికే జగన్ మంత్రులను ఆదేశించారు. ఎమ్మెల్యేల బాధ్యతలను మంత్రులకు అప్పగించారు. ప్రతి మంత్రికి ఎమ్మెల్యేలను కేటాయించి వారు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా, సక్రమంగా ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థి బరిలో ఉండటంతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమై అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలను ముందుగానే తీసుకుంటుంది.
- Tags
- ycp
- mlc elections
Next Story