Sun Dec 14 2025 06:20:12 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ చివరి సిద్ధం సభ .. ఈసారి ఎక్కడంటే?
వైసీపీ నాలుగో సిద్ధం సభకు రెడీ అయిపోతుంది. మార్చి మూడో తేదీన సభను నిర్వహించాలని నిశ్చయించింది.

వైసీపీ నాలుగో సిద్ధం సభకు రెడీ అయిపోతుంది. ఇప్పటికే భీమిలీ, దెందులూరు, రాప్తాడులో సిద్ధం సభలను నిర్వహించిన వైసీపీ నాలుగో సభను కోస్తాంధ్ర జిల్లాల్లో సభను నిర్వహించాలని రెడీ అయింది. ప్రకాశం జిల్లా మేదరమెట్లలో చివరి సిద్ధం సభను నిర్వహించాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. మార్చి మూడో తేదీన సభను నిర్వహించాలని నిశ్చయించింది.
మేదరమెట్లలో...
బాపట్ల నియోజకవర్గం పరిధిలోని మేదరమెట్లలో సిద్ధం సభను నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని ఆ ప్రాంత నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది. ముప్ఫయికి పైగా నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున కార్కకర్తలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు వెళ్లాయి. మొత్తం నాలుగు చోట్ల సభలను నిర్వహించాలని నిర్ణయించింది.
Next Story

