Sun Dec 22 2024 07:54:16 GMT+0000 (Coordinated Universal Time)
Raghu Rama : నేడు టీడీపీలో చేరనున్న రాజుగారు.. టిక్కెట్ కన్ఫర్మ్ అయినట్లేనా?
వైసీపీ నేత, నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు నేడు టీడీపీలో చేరనున్నారు
వైసీపీ నేత, నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు నేడు టీడీపీలో చేరనున్నారు. ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు నరసాపురం ప్రజాగళం సభకు హాజరు కానున్నారు. ఈ సభలోనే రఘురామకృష్ణరాజు పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. మొన్ననే నరసాపురం చేరుకున్న రఘురామకృష్ణరాజు తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
చేరిన తర్వాతనే స్పష్టత...
ఈరోజు ఆయన టీడీపీలో చేరిన తర్వాత తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను వివరించనున్నారని తెలిసింది. ఆయనకు ఎమ్మెల్యేగా, ఎంపీగా సీటు ఇస్తారన్న నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నారు. అయితే ఇప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో కొన్నింటిలో ఆయన కోసం మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రకటించిన అభ్యర్థులను మార్చి ఆయనకు టిక్కెట ఇస్తారా? లేకుంటే మరొక అవకాశమిస్తానని చంద్రబాబు హామీ ఇస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story