Mon Dec 23 2024 03:47:32 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ట్రాప్ లో వైసీపీ నేతలు పడొద్దన్న కడప నేత
టీడీపీకి ఓట్లెయ్యలేదని ఆ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నారని వైసీపీ నేత అంజాద్ భాషా అన్నారు
టీడీపీకి ఓట్లెయ్యలేదని ఆ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నారని వైసీపీ నేత అంజాద్ భాషా అన్నారు. ప్రశాంతమైన కడప నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వైసీపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు కడపలో మత విద్వేషాలు లేవని, కడప టీడీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని వారి ట్రాప్ లో పడవద్దంటూ వైసీపీ నేతలకు అంజాద్ భాషా విజ్ఞప్తి చేశారు. ఘర్షణ వాతావరణానికి దారి తీసే అవకాశాలున్నందున అమాయకులు ఇరుక్కోవద్దని చెప్పారు.
కావాలని అల్లర్లు సృష్టించేందుకు...
టీడీపీ నాయకుల కుట్రలకు బలి కాకూడదని ఆయన కోరారు. 2014,ఎన్నికలు,2019 ఎన్నికలు ఎంతో సజావుగా సాగాయని, ప్రజాధారణతో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచానని, అపుడు లేనటువంటి మత విద్వేషాలు, అల్లర్లు 2024 కు టీడీపీ పథకం ప్రకారం కుల మతాన్ని ముందుకు తీసుకువచ్చి అల్లర్లు సృష్టిస్తోందని ప్రజలందరూ తెలుసుకోవాలని ఆయన కోరారు. ప్రజలు సంయమనం పాటించి టీడీపీ వలలో పడవద్దని మనవి చేశారు. వైసీపీ ఎమ్మెల్యేగా మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ విజయం సాధిస్తున్నామని ఆయన తెలిపారు.
Next Story