Mon Dec 23 2024 02:15:21 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : బొత్స, పవన్ ఆప్యాయత చూశారా?
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ఇద్దరు శాసనసభ ప్రాంగణంలో ఒకరికొకరు ఎదురు పడ్డారు
ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు. ఉప్పు నిప్పుగా నిత్యం అసెంబ్లీ సమావేశాల్లో వాదులాడుకునే వారిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు ఇద్దరు శాసనమండలి ప్రాంగణంలో ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఒకరినొకరు కరచాలనం చేసుకున్నారు. నమస్కారానికి, ప్రతి నమస్కారం పెట్టుకున్నారు.
ఉప్పు నిప్పుగా ఉండే...
శాననమండలిలో వైసీపీ పక్ష నేతగా బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీపై ఎప్పుడూ నిప్పులు చెరుగుతుంటారు. కానీ వీరిద్దరూ బయట ఆప్యాయంగా పలకరించుకోవడం పలువురిని ఆకట్టుకుంది. అయితే ఎదురుపడినప్పుడు మర్యాదపూర్వకంగా పలుకరించుకోవడమేనని పార్టీ నేతలు చెబుతున్నారు. వారిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటు వైపు వెళుతూ ఇద్దరినీ చూస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
Next Story