Fri Jan 10 2025 15:31:00 GMT+0000 (Coordinated Universal Time)
Botsa : తొక్కిసలాటకు బాధ్యులు వాళ్లు కాదా?
తిరుమల తొక్కిసలాట చాలా బాధాకరమరి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు.
తిరుమల తొక్కిసలాట చాలా బాధాకరమరి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని బొత్స అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్ధత వలన ఆరు నిండు ప్రాణాలు పోయాయని తెలిపారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన జరగలేదన్న బొత్స ఒక ప్రాంతంలో ఉన్న డిఎస్పీ ని సస్పెండ్ చేస్తే మిగతా ప్రాంతాల అధికారుల మాటేంటి..? అని ప్రశ్నించారు. మరో రెండు ప్రదేశాల్లో తొక్కిసలాట జరిగిందని, అక్కడ ఆ అధికారులను ఎందుకు సస్పెండ్ చెయ్యలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీ వరకు కుప్పంలోనే ఉన్నారని, ఎందుకు సమీక్ష చెయ్యలేదని బొత్స నిలదీశారు.
రివ్యూ చేయకుండా...
ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఆరా తీయచ్చు కదా అని ప్రశ్నించారు. దేవాదాయ శాఖ మంత్రి కూడా ఎందుకు రివ్యూ చెయ్యలేదో అర్ధం కాలేదన్న బొత్స రివ్యూ చెయ్యడానికి సీఎం అనుమతి ఇచ్చారో లేదో తెలియదుఅంటూ ఎద్దేవా చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణతో సరిపెట్టారని, క్షమాపణ ఒక్కటేనా..? దీక్ష ఏమైనా చేస్తారా..? ఆ దీక్ష ఎవరు చేస్తారు..? అని ప్రశ్నించారు. తిరుపతిలో జరిగిన ఘటన వలన భక్తుల్లో భయం నెలకొందని, ఈరోజు సింహాచలంలో భక్తులు ఎక్కువగా రాలేదని బొత్స తెలిపారు.తొక్కిసలాట నెపాన్ని కూడా గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్న బొత్స విజయవాడ వరదల్లో కూడా మానవ తప్పిదం వలనే ప్రజలు చనిపోయారని, నీరు, ఆహారం, మందులు అందక జనం చనిపోయారని అన్నారు. అధికారులకు పార్టీ రంగులు పూస్తున్నారని, అధికారులతో పని చేయించుకోవాలి కాని వారిపై పార్టీల ముద్ర వేయడం సరికాదని బొత్స అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న అధికారులు అందరూ టీడీపీ ప్రభుత్వం నియమించిన అధికారులేనని, తిరుపతి తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు చేయాలని, ఏపీ హై కోర్టు సుమోటోగా కేసును తీసుకొని సిట్టింగ్ జడ్జితో చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story