Mon Dec 23 2024 08:05:59 GMT+0000 (Coordinated Universal Time)
నోరు జారితే తాటతీస్తా.. బొండాకు దేవినేని వార్నింగ్
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పై వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ పై వైసీపీ యువనేత దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను ఇప్పటీకీ నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన తండ్రి దేవినేని నెహ్రూ చనిపోయి ఐదేళ్లవుతున్నా ఇంకా ఆయనను టార్గెట్ చేయడం తగదని సూచించారు. కందుకూరు ఘటనను పక్కదోవపట్టించే ప్రయత్నం టీడీపీ చేస్తుందన్నారు. బోండా ఉమ ఒక చిల్లర వ్యక్తి అని అన్నారు. బజారు మనిషిలా వ్యవహరిస్తున్నారని, బొండా కుటుంబం గురించి చెప్పాలంటే చాలా ఉందని దేవినేని అన్నారు.
బొండా ఉమ జీవితం...
ఐలాపురం వెంకయ్య దగ్గర డ్రైవర్ గా పనిచేసి కాళ్లు నొక్కి చివరకు వారినే మోసం చేసిన వ్యక్తి బొండా ఉమ అని అన్నారు. తిరుపతిలో బొండా ఉమ సారా వ్యాపారం చేశాడని ఆరోపించారు. కారు రేసులు, రేవ్ పార్టీ కల్చర్ నగరానికి తెచ్చింది బొండా ఉమాయేనని ఆరోపించారు. ఆయన కుమారులు ఈ సంస్కృతిని తెచ్చారని విమర్శించారుక. చంద్రబాబును బొండా ఉమ బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. కాపుల గొంతును కోసింది చంద్రబాబు అంటూ అప్పుడు మొరిగింది బొండా ఉమ కాదా? అని ప్రశ్నించారు. బెజవాడకు గంజాయిని అలవాటు చేసింది బొండా ఉమాయేనని అన్నారు. ఇంకోసారి వైసీపీ ప్రభుత్వం గురించి కాని, తన గురించి మాట్లాడితే తాట తీస్తానని దేవినేని అవినాష్ హెచ్చరించారు.
Next Story