Mon Dec 23 2024 07:54:08 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబును తిట్టేది టీడీపీ నేతలే
వైసీపీ నాయకుల కంటే టీడీపీ నేతలే చంద్రబాబును ఎక్కువ తిడతారని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు.
వైసీపీ నాయకుల కంటే టీడీపీ నేతలే చంద్రబాబును ఎక్కువ తిడతారని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. ఉదయం చంద్రబాబుని దేవుడని పొగుడుతారని, రాత్రి అయ్యేసరికి తిడతారని ఫైర్ అయ్యాడు. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల దగ్గర లక్షలు తీసుకుని టిక్కెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. తన తండ్రి చేతిలో గద్దె రామ్మోహన్ ఓడిపోయిన విషయాన్ని దేవినేని అవినాష్ గుర్తు చేశారు. చెన్నుపాటి గాంధీ వద్ద వైసీపీ కార్యకర్తల గొడవ పడితే దానికి రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.
జగన్ ను విమర్శిస్తే...
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కాబట్టి ఏమీ చేయలేక కవ్వింపు చర్యలకు దిగుతున్నారని దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ నేతల మాట్లాడిన మాటలన్నీ తమ వద్ద రికార్డులో ఉన్నాయన్నారు. జగన్ కాని, ఆయన కుటుంబాన్ని కాని విమర్శిస్తే గతంలో ఎలా స్పందించామో అలాగే ఇప్పుడు కూడా రియాక్ట్ అవుతామని చెప్పారు. విజయవాడలో టీడీపీ లేదని చెప్పారు. బీసీ నేత బుద్దా వెంకన్నను అవమానించారని అన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ లో ప్రధాన నిందితుడు గద్దె రామ్మోహన్ అని దేవినేని అవినాష్ ఆరోపించారు.
Next Story