Sun Dec 22 2024 22:17:34 GMT+0000 (Coordinated Universal Time)
హార్డ్ డిస్క్ లా... నాకు తెలియదే?
ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ ఇంటి నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని వైసీపీ నేత దేవినేని అవినాష్ తెలిపారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు తమ ఇంటి నుంచి ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని వైసీపీ నేత దేవినేని అవినాష్ తెలిపారు. 24 గంటల పాటు తమ ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించిందన్నారు. తన తండ్రి దేవినేని నెహ్రూ తమకు అప్పగించిన వ్యవసాయ భూములున్నాయని తెలిపారు. అలాగే హైదరాబాద్ లో ఒక ల్యాండ్ తమకు ఉందని చెప్పారు. దానిని అభివృద్ధికి ఇచ్చామని ఆయన అన్నారు. తమ ఇంటి నుంచి హార్డ్ డిస్క్ లు పట్టుకుపోయారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
టీడీపీ వ్యవస్థలతో కుమ్మక్కై...
ఐటీ శాఖ అధికారులు కొన్ని ప్రశ్నలు వేశారని, వాటికి తాము సమాధానం చెప్పామని తెలిపారు. తమకు ఎలాంటి వ్యాపారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. తమ కుటుంబం నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలోనే ఉందని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బలపడుతున్నామని, టీడీపీ వ్యవస్థలతో కుమ్మక్కై తమపై ఇలాంటి దాడులకు ఉసిగొల్పుతుందని ఆయన ఆరోపించారు. అయితే తాము దేనికీ భయపడబోమని ఆయన చెప్పారు.
Next Story