Sun Dec 14 2025 10:00:27 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada : పేరు మార్చేసుకున్న ముద్రగడ
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తాను చెపినట్లే చేశారు. తన పేరును ముద్రగడ మార్చుకున్నారు.

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తాను చెపినట్లే చేశారు. తన పేరును ముద్రగడ మార్చుకున్నారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేయించుకున్నారు. దీంతో అధికారికంగా ముద్రగడ పేరు ఇకపై ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారింది.
గెజిట్ నోటిఫికేషన్...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలిస్తే తాను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. పిఠాపురంలో పవన్ గెలవడం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావడంతో ఆయన తాను చెప్పినట్లుగానే తన పేరుకు రెడ్డి ని కలుపుకుని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.
Next Story

