Mon Dec 23 2024 06:27:14 GMT+0000 (Coordinated Universal Time)
Mudragada : పవన్ కు ముద్రగడ మరో వార్నింగ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను గాజువాక, భీమవరంలో తన్ని తగలేశారన్నారు. ఈ ఎన్నికల్లో పిఠాపురంలోనూ పవన్ కల్యాణ్ కు ఓటమి తప్పదని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు చేతిలో పావుగా మారారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తన కుమార్తెను పవన్ కల్యాణ్ రోడ్డు మీదకు లాగారన్నారు. ముద్రగడ ఇంటిపేరు లేదే అని పవన్ అన్నారని, తన ఇంటి పేరును వేదికపై ఉపయోగిస్తావా? అని ప్రశ్నించారు. మీ ముగ్గురి భార్యలను జనాలకు పరిచయం చేయి అంటూ పవన్ పై విమర్శలు చేశారు.
గురువు నుంచి నేర్చుకున్నారా?
తన కుమార్తె, తనకు మధ్యచిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దని ముద్రగడ పద్మనాభం అన్నారు. కులాలు, కుటుంబాలు మధ్య చిచ్చు పెట్టడం నీ గురువు చెప్పినట్లే నువ్వు నడుచుకుంటున్నావా? అని ప్రశ్నించారు. ఆయన వద్ద నేర్చుకుంటున్నావా? అని ప్రశ్నించారు. పవన్ చెప్పేది సొల్లు అని, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి అంటూ ముద్రగడ అన్నారు. చంద్రబాబు ఎస్టేట్ లో పవన్ మేనేజర్ గా మారారన్నారు. ఆయనకే దిక్కులేదు కానీ నా కుమార్తెకు టిక్కెట్ ఇప్పిస్తానని పవన్ చెప్పడంపై ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు.
Next Story