Mon Dec 23 2024 06:59:28 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మమ్మల్ని చంపేయండి.. పవన్ ఫ్యాన్స్ తో ముద్రగడ
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి సంచలన వ్యాఖ్యలుచేశారు.
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి సంచలన వ్యాఖ్యలుచేశారు. తనను, తన కుటుంబాన్ని పవన్ అభిమానులు బూతులు తిడుతున్నారన్నారు. సోషల్ మీడియా వేదికగా తన కుటుంబంపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని అన్నారు. ఇంతకంటే తమను చంపేయమంటూ ముద్రగడ పద్మనాభం పవన్ ఫ్యాన్స్ ను వేడుకున్నారు.
సోషల్ మీడియాలో...
పవన్ అభిమానుల పేరుతో తనపై దూషణలకు దిగుతున్న వారిని కంట్రోలు చేసేవారే కరువయ్యారన్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని చెప్పానని, అన్న మాట ప్రకారమే తాను పేరు మార్చుకున్నానని, అంత మాత్రాన తనను తిట్టిపోస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తమకు ఎవరూ లేరని, అనాధలమని ముదగ్రడ పద్మనాభం ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story