Mon Dec 23 2024 11:54:34 GMT+0000 (Coordinated Universal Time)
Pothina Mahesh : జనసేనలో అసలు నేతలున్నారా? పవన్ కు గమ్యం తెలుసా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎటు పయనిస్తున్నారో ఆయనకైనా తెలుసా అని వైసీీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎటు పయనిస్తున్నారో ఆయనకైనా తెలుసా అని వైసీీపీ నేత పోతిన మహేష్ ప్రశ్నించారు. జనసేనకు ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ తప్ప మిగిలిన జిల్లాల్లో అసలు నేతలు ఉన్నారా? అని నిలదీశారు. ఆయనకు పార్టీని బలోపేతం చేయాలని లేదన్న విషయం దీన్ని చూస్తేనే అర్థమవుతుందన్నారు. పవన్ కల్యాణ్ ఒక ఎయిమ్ లేకుండా పయనిస్తున్నారన్న పోతిన మహేష్ ఆయన కారణంగా ఎందరో జనసేన నేతలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారన్నారు. జనసేన పార్టీ అకౌంట్ లో డబ్బు ఎంత ఉందో చెప్పాలన్నారు. ఎలక్ట్రోరల్ బాండ్ విషయాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను బయటపెట్టాలన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయాన్ని కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు.
పార్టీని తాకట్టు పెట్టి...
ఏదో వ్యూహం ఉందని ఆయన నమ్మి తామంతా పార్టీ కోసం ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టుకుంటే ఆయన చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని పార్టీని తాకట్టు పెట్టేశారన్నారు. ఈ విషయం జనసైనికులు, వీరమహిళలకు అర్థమయిందన్నారు. అందుకే ఒక్కరూ ఆపార్టీలో ఉండకుండా బయటకు వస్తున్నారన్నారు. జగన్ ను ఎదుర్కొనే దమ్ము , ధైర్యం లేకపోతే పార్టీ ని మూసేసుకోవాలని, కానీ పార్టీ నేతలను తాకట్టు పెడితే ఎలా అని ప్రశ్నించారు. జనసైనికులను జెండాలు మోసే కూలీలుగా పవన్ కల్యాణ్ చూసేంత వరకూ ఆ పార్టీ బాగుపడదని పోతిన మహేష్ అన్నారు. జనసేన ఇప్పటి వరకూ సేకరించిన నిధులన్నీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆయన నిధుల గురించి ఎప్పుడూ చెప్పరన్నారు. ఎప్పుడూ తన సంపాదనతోనే పార్టీని నడుపుతున్నట్లు మాట్లాడే పవన్ కల్యాణ్ సేకరించిన నిధులు ఏమయ్యాయని అన్నారు.
Next Story