Mon Dec 23 2024 11:41:42 GMT+0000 (Coordinated Universal Time)
Pothina Mahesh Comments:నాదెండ్ల మనోహర్ పై పోతిన హాట్ కామెంట్స్... పది కోట్ల స్పోర్ట్స్ ఎక్కడంటూ?
జనసేన నేత నాదెండ్ల మనోహర్ పై వైసీపీ నేత పోతిన మహేష్ హాట్ కామెంట్స్ చేశారు
Pothina Mahesh Comments:జనసేన నేత నాదెండ్ల మనోహర్ పై వైసీపీ నేత పోతిన మహేష్ హాట్ కామెంట్స్ చేశారు. నాదెండ్ల మనోహర్ వద్ద వ్యాపారం చేయకుండా డబ్బులు ఎలా సంపాదించాలో నేర్చుకోవాలన్నారు. ఆయన ఇందులో ఆరితేరారని పోతిన మహేష్ అన్నారు. పది కోట్ల రూపాయలు పెట్టి ఇద్దరు కూర్చునే స్పోర్ట్స్ కారును నాదెండ్ల మనోహర్ కొనుగోలు చేశారన్నారు.
డబ్బులు సంపాదించడంపై...
ఆ కారును హైదరాబాద్ లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉంచారన్నారు. ఈ పది కోట్ల రూపాయలు నాదెండ్ల మనోహర్ కు ఎక్కడి నుంచి వచ్చాయమని ఆయన ప్రశ్నించారు. తెనాలిలో ఓటర్లు నాదెండ్ల మనోహర్ నుంచి పది వేల రూపాయలు ఓటుకు డిమాండ్ చేసినా తప్పు లేదన్నారు. జనసేన నేతలను వంచించి ఇతర పార్టీల నేతలకు టిక్కెట్లు అప్పగించింది నాదెండ్ల మనోహర్ అని అన్నారు. జనసేన అభ్యర్థులతోనూ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
Next Story