చంద్రబాబు రక్త పరీక్షలకు సిద్ధమా..?
టీడీపీ, నారా లోకేష్‌పై ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ నేత రవిచంద్రారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
టీడీపీ, నారా లోకేష్‌పై ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, వైసీపీ నేత రవిచంద్రారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నెల్లూరులో ఓ అమాంబాపతి దాడి జరిగిందని కాకిలా అరుస్తున్నాడని గగ్గోలు పెడుతున్నాడని అన్నారు. ప్రెస్నోట్లు పెడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రవిచంద్ర మండిపడ్డారు. ఆనం వెంకటరమణారెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ రవిచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ''ఆనం వెంకటరమణారెడ్డి తనను కొట్టడానికి 8 మంది వచ్చారని, కర్రలు తెచ్చారని అంటున్నారని, అయితే దారినా పోయే కుక్కనైనా కొడుతారని, నిన్ను ఎవరు కొడతారు. నువ్వే చీకట్లో ఓ భూతం లాంటోడివి'' అంటూ రవిచంద్ర విరుచుకుపడ్డారు.
ఒకడికి 10 మందిని తెచ్చుకునే బాపతు చంద్రబాబుకు అలవాటని అన్నారు. చంద్రబాబు.. ఒక్కడిగా ఎన్నికలకు రాలేడని, ఒక్కడిగా ఓట్లు అడగలేడని, 10 మందితో పొత్తు ఉంటే కానీ.. ప్రజలను కన్వీన్స్ చేయలేడని.. ఎందుకంటే ఆయన చేసింది ఏమీ లేదని అన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని, తొడలు కొట్టి ప్రగల్భాలు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. లోకేష్‌పై కోడిగుడ్లు విసిరి.. కోడి గుడ్డును ఎవరూ కూడా వేస్ట్ చేసుకోరని అన్నారు. టీడీపీ దివాళా కోరు పార్టీగా మారిందన్నారు. నారా లోకేష్ సభ్యతతో, సంస్కారంతో మాట్లాడాలని రవిచంద్ర హెచ్చరించారు. లోకేష్‌కు సభ్యత, సంస్కారం నెర్పకపోవడం చంద్రబాబు చేసిన తప్పని అన్నారు.
లోకేష్‌కు చంద్రబాబు నేర్పించింది సంపాదన, పలకమంది ప్రగల్భాలు అంటూ రవిచంద్ర సెటైర్ వేశారు. మంగళగిరిలో చేతకానీ లోకేష్.. రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రజలకు చేసిందేమి లేదన్నారు. టీడీపీని తెలుగు డ్రామా పార్టీగా మార్చారని అన్నారు. బూతులు తిట్టడానికి కొందరు టీడీపీ నాయకులను కేటాయించారని, లోకేష్ సీఎం జగన్ ఆరోగ్యం పై అవాకులు మాట్లాడాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎక్కడైనా రక్త పరీక్షలకు సిద్ధమా..? లోకేష్ మీ నాన్న చొక్కా విప్పి చూపించగలరా.? అంటూ ప్రశ్నించారు. పిల్లి గట్టిగా అరిచినంత మాత్రానా అది గాండ్రిపు కాదని అన్నారు. అధికారం పోవడంతో చంద్రబాబు, లోకేష్‌లు సైకోలుగా మారరని రవిచంద్రారెడ్డి అన్నారు.