Mon Dec 23 2024 06:40:20 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్‌పై సజ్జల హాట్ కామెంట్స్: హామీలు అమలు కాలేదని ఆగ్రహం!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని సజ్జల అన్నారు. తిరుపతిలో జరిగిన భూమన కరుణాకరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా ప్రసంగించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని, నిత్యం ఏదో ఒక అరాచకం చేస్తున్నారని సజ్జల అన్నారు.
తప్పుడు కేసులు పెడుతూ...
వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. డ్డంగా దోచుకుని జేబులు నింపుకుంటున్నారని సజ్జల అన్నారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు విషప్రచారం చేశారని, సూపర్-6 హామీలు ఎక్కడా అమలు కాలేదని, ఐదు నెలల్లో రూ.53 వేల కోట్ల అప్పు చేశారని, సజ్జల రామకృష్ణారెడ్డి మండి పడ్డారు. త్వరలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పటిష్టమైన కార్యకర్తలను పార్టీ సిద్ధం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనంటూ సజ్జలహాట్ కామెంట్స్ చేశారు.
Next Story