Mon Dec 23 2024 01:40:48 GMT+0000 (Coordinated Universal Time)
Sajjala : చంద్రబాబుపై సజ్జల హాట్ కామెంట్స్... ఆయనను నమ్ముకుంటే?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలను ఎవరూ నమ్మరని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలను ఎవరూ నమ్మరని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిన్నటి వరకూ వాలంటీర్లపై విషం చిమ్మిన చంద్రబాబు ఒక్కసారిగా వారిపై ప్రేమ కురిపించడంలోనే అర్థముందన్నారు. వాలంటీర్లకు తాము అధికారంలోకి వస్తే పది వేల రూపాయలు ఇస్తామని చెప్పడం, వాలంటీర్ల వ్యవస్థను కొసాగిస్తామని చెప్పడంతో పాటు లక్ష రూపాయలు సంపాదించుకునేలా చేస్తానని చెప్పడం ఎన్నికల జిమ్మిక్కేనని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తీసేద్దామని అన్న చంద్రబాబు మాటలకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారన్నారు.
తిరిగి జన్మభూమి కమిటీలను...
ఇప్పుడున్న వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని చెబుతున్నాడని, అధికారంలోకి వస్తే వీళ్లను తొలగించి జన్మభూమి కమిటీలను నియమించుకుంటారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. లోకేష్ కూడా గతంలో అన్నట్లు ఆ వ్యవస్థ తీసుకు వచ్చి తాము అనుకున్న వారికే పథకాలు ఇచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నాడన్నారు. అర్హత ఉన్నవాళ్లందరికీ పథకాలు అందకుండా, కేవలం తమ పార్టీకి చెందిన వాళ్లకే పథకాలు ఇస్తారని సజ్జల అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేస్తారని ఎవరూ నమ్మరని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒంగోలులో జరిగిన ఘటనపై కూడా ఆయన స్పందించారు. టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని, టీడీపీ వాళ్ల గొడవల వల్లనే అక్కడ ఘర్సణ జరిగిందన్నారు.
Next Story