Fri Apr 11 2025 07:03:02 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : రెడ్ బుక్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్ బుక్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్ బుక్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ తమ పార్టీ వాళ్లు కూడా ఎక్కడికక్కడ రాస్తున్నారన్నారు. అన్యాయం చేసిన వారి పేర్లను, అధికారుల పేర్లను అందులో రాసుకుంటున్నారని జగన్ మంగళగిరి నేతలతో జరిగిన సమావేశంలో అన్నారు. అయితే తాను రెడ్ బుక్ స్థానంలో గుడ్ బుక్ రాయడం మొదలు పెట్టానని వైఎస్ జగన్ తెలిపారు.
కార్యకర్తల పేర్లు గుడ్ బుక్ లో...
అందులో పార్టీకి బాగా పనిచేశానని కార్యకర్తల పేర్లు రాసుకుంటున్నానని తెలిపారు. కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని వైఎస్ జగన్ తెలిపారు. కార్యకర్తలకు నష్టం జరగకుండా అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడే కార్యకర్తలకు భరోసా కల్పిస్తామని తెలిపారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు అవసరమైన న్యాయసహాయం కూడా అందిస్తామనిచెప్పారు.
Next Story