Fri Apr 25 2025 18:48:07 GMT+0000 (Coordinated Universal Time)
క్యాంప్ కార్యాలయానికి వచ్చిన నేతలు... సీట్ల మార్పులు చేర్పులపై
తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వైసీపీ నేతలు చేరుకున్నారు

తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వైసీపీ నేతలు చేరుకున్నారు. వారితో నియోజకవర్గంలోని అంశాలపై క్యాంప్ కార్యాలయంలో ఉన్న నేతలు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే వైసీపీ ఏడో జాబితా ప్రకటించే అవకాశముందని తెలిసింది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు రావడంతో వచ్చిన నేతలు తమ నియోజకవర్గాల పరిస్థితులపై చర్చలు జరిపారు.
ఎమ్మెల్యేలతో పాటు...
ఈరోజు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీమోహన్ రెడ్డిలు కలిశారు. వీరితో ఏ విషయాలు చర్చించారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Next Story