Sat Mar 15 2025 10:51:27 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ అభ్యర్థిగా మేకపాటి శ్రీకీర్తి
ఆత్మకూరు కు జరగనున్న ఉప ఎన్నికల్లో దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తిని పోటీ చేయించాలని వైసీపీ భావిస్తుంది

ఆత్మకూరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తిని పోటీ చేయించాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తుంది. మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే ఎన్నికల కమిషన్ ఇంకా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయలేదు.
ఏకగ్రీవం దిశగా......
ఉప ఎన్నికలో మేకపాటి గౌతమ్ రెడ్డి భార్య శ్రీకీర్తిని పోటీ చేయించాలని భావిస్తున్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వయసు మీద పడుతుండటం, గౌతమ్ రెడ్డి కుమారుడు వయసు రీత్యా చిన్నవాడు కావడంతో ఈ ఉప ఎన్నికల బరిలో శ్రీకీర్తిని పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే దీనిపై మేకపాటి కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Next Story