Thu Dec 19 2024 05:42:59 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పిన్నెల్లికి సుప్రీంకోర్టు షాక్.. నిషేధం విధిస్తూ..?
వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది
వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊహించని షాక్ తగిలింది. పిన్నెల్లిని కౌంటింగ్ సెంటర్ వద్దకు వెళ్లవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయట ఉంటే తనకు ప్రాణహాని ఉందని టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరి రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు.
రేపు కౌంటింగ్ సెంటర్ ..
అయితే పిటీషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ సెంటర్ కు వెళ్లవద్దని ఆదేశించింది. అయితే అరెస్ట్ నుంచి హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మినహాయింపు ఇవ్వడంతో ఆయనను కౌంటింగ్ సెంటర్ కు వెళ్లకుండా చూడాలని ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మినహాయింపు ఇచ్చినా సుప్రీంకోర్టు మాత్రం ఆయనను కౌంటింగ్ సెంటర్ కు వెళ్లవద్దని తెలిపింది. ఈ నెల 6వ తేదీన సమగ్ర విచారణ జరుపుతామని తెలిపింది.
Next Story