Sun Dec 22 2024 17:41:30 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి రిలీఫ్.. అయితే షరతులు వర్తిస్తాయ్
వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.
వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్లపై నేడు తీర్పు వెలువరించింది. తనపై దాఖలయిన హత్యాయత్నం కేసులలో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దంటూ ఫిర్యాదుదారులు కోరారు.
ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో...
అయితే ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం పిన్నెల్లి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. మూడు హత్యాయత్నం కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. అయితే జూన్ 6వ తేదీ వరకూ మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయవద్దంటూ గతంలో కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అవే షరతులు ఈ కేసుల్లో కూడా వర్తిస్తాయని పేర్కొంది.
Next Story