Tue Apr 01 2025 15:30:32 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : రేపు వైసీపీ మ్యానిఫేస్టో.. ఈసారి వారిపై కూడా వరాల జల్లు అట
వైసీపీ మ్యానిఫేస్టో రేపు విడుదల కానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి

వైసీపీ మ్యానిఫేస్టో రేపు విడుదల కానుంది. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ మ్యానిఫేస్టో విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈసారి మ్యానిఫేస్టోలో జనరంజకమైన అంశాలకు చోటు కల్పించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. మ్యానిఫేస్టో అతిగా ఉండదని, చేయబోయే పనులు మాత్రమే చెబుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
కొనసాగుతున్న పథకాలు....
ఇప్పటి వరకూ అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూ వాటికి ఇస్తున్న నగదును కొంత మేరకు పెంచనున్నారు. మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల లక్ష్యంగా ఈ మ్యానిఫేస్టోను రూపొందించినట్లు చెబుతున్నారు. దీంతో పాటు ఈసారి మ్యానిఫేస్టోలో మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే పథకాలతో పాటు కొన్ని మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా చెప్పనున్నారని తెలిసింది. ఈ నెల 27వ తేదీన మ్యానిఫేస్టోను విడుదల చేసిన అనంతరం జగన్ 28వ తేదీ నుంచి వరసగా రోజుకు మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
Next Story