Sat Dec 21 2024 14:22:16 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి వైసీపీ సభకు వసంత దూరం
రేపు దెందులూరులో వైసీపీ సభ జరగనుంది. ఈ సభకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉండనున్నారు.
రేపు దెందులూరులో వైసీపీ సభ జరగనుంది. ఈ సభకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉండనున్నారు. దెందులూరు సిద్ధం పేరుతో సభను వైసీపీ నిర్వహిస్తుంది. ఈ సభ కోసం అన్ని నియోజకవర్గాల నుంచి నేతలు, ముఖ్య కార్యకర్తలు హాజరు అవుతున్నారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం హాజరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్టా జిల్లాల నుంచి కార్యకర్తలు, నేతలు రావాలని ఇప్పటికే పార్టీ ఆదేశించింది. మైలవరం నుంచి కార్యకర్తలను తరలించే బాధ్యతలను పార్టీ నాయకత్వం కేశినేని నానికి అప్పగించింది.
ఎల్లుండి మీడియా ముందుకు....
మైలవరం స్థానాన్నీ ఈసారి తనకు ఇవ్వరని తెలిసి వసంత కృష్ణ ప్రసాద్ ఇటీవల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ నెల 4వ తేదీన మీడియా సమావేశంలో అన్ని విషయాలు చెబుతానని చెప్పారు. ఆయన పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతుంది. మైలవరం టిక్కెట్ జోగి రమేష్ కు ఇచ్చే అవకాశం ఉండటంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఆయన దెందులూరు సభకు హాజరు కాకపోతే పార్టిని వీడేందుకు నిర్ణయించుకున్నారని అనుకోవచ్చు.
Next Story