Fri Apr 04 2025 07:46:36 GMT+0000 (Coordinated Universal Time)
మాకేం సంబంధమన్న మాగుంట
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. తనకు అమిత్ అరోరా ఎవరో తెలియదని ఆయన అన్నారు. అరోరాను తాను ఎప్పుడూ కలవలేదని ఎంపీ మాగుంట చెప్పారు. దక్షిణాది వ్యాపారులపై ఉత్తరాది వ్యాపారులు చేస్తున్న కుట్ర అని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు.
వాటాల్లేవు...
తన కుమారుడికి కూడా ఆ కంపెనీల్లోనూ వాటాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆరోపణలపై త్వరలో నిజాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. తాము నిజాయితీగానే, చట్టబద్దంగానే వ్యాపారం చేస్తున్నామని మాగుంట తెలిపారు. ఇలాంటి ఆరోపణలు రావడం సహజమేనని, తాము సరైన సమయంలో సమాధానం చెబుతామని ఆయన అన్నారు.
Next Story