Sat Dec 28 2024 16:52:26 GMT+0000 (Coordinated Universal Time)
ఉద్యోగులారా అర్థం చేసుకోండి... లేకపోతే?
ఉద్యోగులను రెచ్చగొట్టి కొందరు లబ్దడి పొందాలని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు
ఉద్యోగులను రెచ్చగొట్టి కొందరు లబ్దడి పొందాలని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఏపీలో అభివృద్ధిని చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి చంద్రబాబు భరించలేకపోతున్నారని అంబటి రాంబాబు అన్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అందుకు ఏదో ఒక అడ్డంకులు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని చెప్పారు. గుడివాడలో గోవా కల్చర్ అంటూ టీడీపీ తప్పుడు ప్రచారానికి దిగిందని ఆయన ఆరోపించారు.
టీడీపీ హయాంలో....
నాడు - నేడు కార్యక్రమాన్ని చూసి టీడీపీ తట్టుకోలేకపోతుందని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ హయాంలో పేకాట ఆడిస్తూ వందల కోట్లు ఆర్జించారన్నారు. రామోజీ ఫిలిం సిటీలో కేబరే డ్యాన్స్ లు ఆడించలేదా? అని అంబటి ప్రశ్నిచారు. ఆసుపత్రిలో ఉన్న కొడాలి నానిపై కక్ష గట్టి మరీ టీడీపీ బురద చల్లే కార్యక్రమానికి దిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా క్లబ్ కల్చర్ ఉందా? అని నిలదీశారు. ఇది ప్రజా ప్రభుత్వమని, చర్చల ద్వారానే పరిష్కారమవుతాయన్ని ఉద్యోగులు గుర్తించాలన్నారు. అందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని అంబటి రాంబాబు కోరారు.
Next Story