Mon Dec 23 2024 10:57:54 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా?
వైసీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది.
వైసీపీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిసింది. చిత్తూరు నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కి పార్టీ అధినాయకత్వం తనకు అన్యాయం చేసిందని భావించి రాజీనామాకు సిద్ధమయినట్లు తెలిసింది. రాయలసీమలోనే బలిజ సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ, తనకు కాకుండా మరొకరిని ఇన్ఛార్జిగా చిత్తూరుకు నియమించడంపై ఆయన గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.
రాజ్యసభ సీటు కూడా...
అయితే ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చిన అధినాయకత్వం అది కూడా ఇవ్వలేదు. దీంతో వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయన టీడీపీలో చేరేందుకు అంతా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆరని శ్రీనివాసులుతో పాటు పదిహేను మంది కార్పొరేటర్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీలు కూడా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. దీంతో చిత్తూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగలనుంది.
Next Story