Sun Dec 22 2024 13:11:08 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన ఆరోపణలు
వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కూడా టీడీపీ నేతలు సంప్రదించారన్నారు
వైసీపీ ఎమ్మెల్యే ఆర్ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కూడా టీడీపీ నేతలు సంప్రదించారన్నారు. తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందన్నారు. నందికొట్కూరు ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తాడేపల్లిలోని తన ఇంటికి కొందరు వచ్చి స్వయంగా మాట్లాడాలన్నారని, ఉదయం మాట్లాడదామని పంపించానని తెలిపారు. మరుసటి రోజు ఫోన్ చేసి తనను టీడీపీ నేతలు సంప్రదించారన్నారు.
తనకూ ఆఫర్...
శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి ఎదుటే తాను ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడనని, తనకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందని ఆయన తెలిపారు. అయితే తాను అలాంటి ప్రతిపాదనలకు అంగీకరించనని కూడా వారితో తెగేసి చెప్పానని ఆర్థర్ తెలిపారు. 200 కోట్ల రూపాయలు ఒకవైపు, జగన్ ఒక వైపు ఉంటే తాను జగన్ వైపు మాత్రమే ఉంటానని ఎమ్మెల్యే ఆర్థర్ చెప్పారు.
Next Story