Tue Nov 05 2024 13:50:14 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: నాకు టిక్కెట్ ఇవ్వనన్నారు.. ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తా
రాయదుర్గం టిక్కెట్ తనకు ఇవ్వలేమని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు.
రాయదుర్గం టిక్కెట్ తనకు ఇవ్వలేమని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అయితే తాను ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. తాను పార్టీలోకి నమ్మి వచ్చినందుకు తమను మోసం చేశారని అన్నారు. తన భార్య కాని కొడుకు కానీ రాయదుర్గం నుంచి పోటీ చేస్తారని, తాను మాత్రం కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తానని ఆయన తెలిపారు. ఐదేళ్లు తాను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనను కలిసేందుకు కూడా ఇష్టపడకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సర్వేల పేరుతో టిక్కెట్ నిరాకరిస్తున్నారన్నారు.
కల్యాణదుర్గం నుంచి కూడా...
ఉదయం నుంచి తాను వేచి ఉన్నప్పటికీ ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. చివరకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలిచి ఈసారి టిక్కెట్ ఇవ్వలేమని చెప్పారు. తనను నమ్మించి గొంతు కోశారని ఆయన మండి పడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నమ్మినందుకు తనకు మోసం చేశారంటూ ఆయన మండి పడ్డారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలోకి దిగుతానని ఆయన తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story