Mon Dec 23 2024 14:44:47 GMT+0000 (Coordinated Universal Time)
జేసీకి పెద్దారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో అక్రమ నిర్మాణాలున్నాయని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ పెద్దల అండతోనే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
పండగ తర్వాత......
అయితే దీనికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌంటర్ ఇచ్చారు. అక్రమ నిర్మాణాలు ఎక్కడ ఉన్నాయో మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ జాబితాను సిద్ధం చేయాలని కోరారు. వాటి కూల్చివేతకు తాను కూడా జేసీ ప్రభాకర్ రెడ్డితో కలసి కూల్చివేతకు వస్తానని చెప్పారు. ఉగాది పండగ తర్వాత కూల్చివేతను పెట్టుకుందామని, అయితే మున్సిపల్ ఛైర్మన్ గా జేసీ వాటిని ఈలోపు గుర్తించాలని కోరారు.
Next Story