Sat Jan 11 2025 14:17:42 GMT+0000 (Coordinated Universal Time)
కోటంరెడ్డి ఆడియో కలకలం
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. ఆయన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ ఆడియో సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది. పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడిన మాటలు బయటకు రావడంతో వైసీపీలో పెద్దకలకలమే రేగింది. తాను 2024లో టీడీపీ నుంచి పోటీ చేస్తున్నానని ఆయన ప్రకటించారు.
స్టేట్ గవర్నమెంట్ షేక్ అవుతుంది...
తాను నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని, టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని, అందుకు సహకారం అవసరమని కార్యకర్తలను కోరారు. అదే సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, అవి బయపడితే ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు ఊడతాయని అన్నారు. అదే మాదరిగా తాను ఆధారాలను బయటపడితే స్టేట్ గవర్నమెంట్ షేక్ అవుతుందని, సెంట్రల్ గవర్నమెంట్ విచారణ జరుపుతుందని ఆయన అన్న వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు జిల్లా వైసీపీలో సంచలనంగా మారయి.
Next Story