Mon Dec 23 2024 20:27:47 GMT+0000 (Coordinated Universal Time)
కోటంరెడ్డిపై హైకమాండ్ సీరియస్
వైసీీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్ ను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది.
వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్ ను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి తీవ్ర వ్యాఖయలు చేశారు. తనపై ప్రభుత్వం నిఘా పెట్టిందని, తన చుట్టూ స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ పోలీసులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరా తీసినట్లు సమాచారం. కోటంరెడ్డి ఎందుకిలా వ్యవహరిస్తున్నారన్న దానిపై ఆయన వివరాలను సేకరించినట్లు తెలిసింది.
నిఘా పెట్టిందంటూ...
తరచూ కోటంరెడ్డి చేస్తున్న వ్యాఖ్యల కారణంగా పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో పడుతుందని భావిస్తున్నారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఈరోజు వినుకొండలో జగన్ దృష్టికి ఈ విషయం తేనున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది. ఇటీవలే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జగన్ పిలిచి మాట్లాడినా ఆయనలో మార్పు లేకపోవడంపై హైకమాండ్ సీరియస్ చర్యలకు దిగే అవకాశముందని తెలిసింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
Next Story