Mon Dec 23 2024 00:37:03 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ను నేను వీడను
మంత్రి పదవి దక్కనందుకు తాను బాధపడటం లేదని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.
మంత్రి పదవి దక్కనందుకు తాను బాధపడటం లేదని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. తాను వైఎస్ జగన్ వెంటే ఉంటానని చెప్పారు. జగన్ పై తనకు నమ్మకం ఉందని, ప్రజలకోసం పనిచేసే నేతలకు పదవులతో పనిలేదని శిల్పా చక్రపాణిరెడ్డి తెలపిారు. ప్రతి సారి పార్టీలు మారే ఆలోచనలు, అలవాటు తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.
మహానాడు అంతా హంబక్....
మహానాడు అంతా హంబక్ అని, త్వరలో నిర్వహించే వైసీపీ ప్లీనరీ చూస్తే టీడీపీ నేతలకు కళ్లు తిరుగుతాయని శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆయన చెప్పారు. తాను అలిగే వ్యక్తిని కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
Next Story