Tue Apr 08 2025 14:02:57 GMT+0000 (Coordinated Universal Time)
నా ట్రాక్ రికార్డు జగన్ కు తెలుసు
తాను పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచుతానని, ఇతరుల మాదిరి ఆస్తుల పెంచుకోనని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.

తాను పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచుతానని, ఇతరుల మాదిరి ఆస్తుల పెంచుకోనని వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరిటాల శ్రీరామ్ పై ఆయన నిప్పులు చెరిగారు. తానేంటో, తన చరిత్ర ఏంటో జగన్ కు బాగా తెలుసునని ప్రకాష్ రెడ్డి తెలిపారు. తాను ఎవరినీ కొట్టి అక్రమంగా సంపాదించలేదని, పేదలకు సేవ చేస్తున్నానన్న ముసుగులో కూడ బెట్టలేదని పరోక్షంగా విమర్శలు చేశారు.
ఆ పది కోట్లతోనే....
తాను మేడా చంద్రశేఖర్ కాంప్లెక్స్ ను కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. ఆ కాంప్లెక్స్ బ్యాంకు వేలం వేస్తుంటే వైట్ మనీతోనే కొనుగోలు చేశానని ప్రకాష్ రెడ్డి వివరించారు. దానిని విక్రయించగా వచ్చిన పది కోట్లతో హైదరాబాద్ లో స్థలాన్ని కొనుగోలు చేశానని చెప్పారు. ఎవరో ఏదో విమర్శిస్తే దానికి తాను జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తన గురించి రాప్తాడు ప్రజలకు తెలుసునని చెప్పారు.
Next Story