Mon Dec 23 2024 00:48:41 GMT+0000 (Coordinated Universal Time)
వసంత + వీరసింహారెడ్డి ఫ్లెక్సీ ... ?
వీరసింహారెడ్డి ఫ్లెక్సీలలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫొటో ఉండటం రాజకీయంగా రచ్చకు మరోసారి దారితీసింది.
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి థియేటర్లలో నేడు విడుదలయింది. అయితే ఇది రాజకీయంగా కూడా కలకలం రేపుతుంది. మైలవరం నియోజకవర్గంలో వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా ఫ్లెక్సీలు వెలిశాయి. వీటిని బాలకృష్ణ అభిమాన సంఘాల పేరుతో ఏర్పాటు చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా ఈ ఫ్లెక్సీలలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫొటో ఉండటం రాజకీయంగా రచ్చకు మరోసారి దారితీసింది.
మళ్లీ కలకలమే....
మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ తన కామెంట్స్ తో తరచూ వివాదాల్లోకి వెళుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన పై హైకమాండ్ కూడా ఆగ్రహంగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో మైలవరంలో బాలకృష్ణ, వసంత కృష్ణ ప్రసాద్ లతో కూడిన ఫ్లెక్సీలు మరోసారి వివాదం అయ్యేట్లు కనిపిస్తున్నాయి.
Next Story