Sun Dec 22 2024 11:16:21 GMT+0000 (Coordinated Universal Time)
దువ్వాడ, మాధురికి నోటీసులు
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, మాధురికి తిరుమల వన్ టౌన్ పోలీసులు నోటీసులు అందచేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుకు తిరుమల వన్ టౌన్ పోలీసులు నోటీసులు అందచేశారు. విచారణకు రావాలని ఇద్దరికీ 41 ఎ కింద నోటీసులు జారీ చేయడానికి తిరుమల నుంచి టెక్కలికి బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనవాసరావుతో పాటు మాధురికి కూడా ఈ నోటీసులు అందచేయనున్నారు.
రీల్స్ చేయడంపై...
దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఇటీవల తిరుమలకు వచ్చినప్పుడు రీల్స్, ఫొటో షూట్ చేయడమే కాకుండా, తిరుమల కొండపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతూ ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వెళ్లి ఆ సమయంలో ఈ చర్యలకు దిగిన ఇద్దరికీ నోటీసులు ఇవ్వనున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణకు రావాలని నోటీసులు అందచేయనున్నారు.
Next Story