Mon Dec 23 2024 01:16:50 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ ఎమ్మెల్సీ చేతివాటం... టిక్కెట్లు అమ్ముకుని
ీవైసీపీ ఎమ్మెల్సీ తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లలో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ చేతివాటం చూపించారు
వైసీపీ ఎమ్మెల్సీ తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లలో వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ చేతివాటం చూపించారు. వివాదంలో చిక్కుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలను ఇస్తూ వారి నుంచి పది వేల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు దీనిపై కేసు నమోదు చేశారు.
వీఐపీ దర్శనం టిక్కెట్లను...
వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న జకియా ఖానమ్ తిరుమల వీఐపీ దర్శనం టిక్కెట్లను ఒక్కొక్కటి పది వేల రూపాయలకు విక్రయించినట్లు బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తిరుమల విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన పోలీసులు జకియా ఖానమ్ పై కేసు నమోదు చేశారు. ఆమె పీఏ కృష్ణతేజను కూడా ఈ కేసులో నిందితులడిగా చేర్చారు. మరికొందరిని ఈ కేసులో నిందితులుగా చేర్చి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Next Story