Sun Dec 22 2024 13:07:49 GMT+0000 (Coordinated Universal Time)
నా కుమారుడు ఏ తప్పుచేయలేదు : మాగుంట
తన కుమారుడు రాఘవరెడ్డి ఎలాంటి తప్పులు చేయలేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు.
తన కుమారుడు రాఘవరెడ్డి ఎలాంటి తప్పులు చేయలేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమారుడు రాఘవరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. తాము 50 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నామన్నారు. తన 32 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులు చేయలేదని, ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు.
ఏడు దశాబ్దాలుగా...
తమ కుటుంబం యాభై దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారంలో ఉన్నామని తెలిపారు. తాము పది రాష్ట్రాల్లో లిక్కర్ వ్యాపారాన్ని చేస్తున్నామని తెలిపారు. మాగుంట కుటుంబం ఏ రాష్ట్రంలోనూ తప్పు చేయలేదన్నారు. పెదనాన్న సుబ్బరామిరెడ్డి పేరును అప్రదిష్ట పాలు చేయనని రాఘవరెడ్డి తనతో చెప్పారన్నారు. తనకు ఇలాంటి కుమారుడిని ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు.
Next Story