Mon Dec 23 2024 10:13:11 GMT+0000 (Coordinated Universal Time)
లిక్కర్ స్కామ్ తో మాకేంటి సంబంధం?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తమకెటువంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తమకెటువంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కొందరు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తమ కుటుంబం ఏడు దశాబ్దాలుగా లిక్కర్ వ్యాపారాన్ని నిర్వహిస్తుందని చెప్పారు. అయితే ఎక్కడా తాము నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని చెప్పారు. ఈడీ జరిపిన దాడుల్లో ఎటువంటి ఆధారాలు లభించలేదని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకే కాదు తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఏ బిజినెస్ లోనూ డైరెక్టర్లుగా లేవన్నారు.
మా బంధువుల్లో కొందరు...
ఢిల్లీలో 32 జోన్లు ఉంటే మా బంధువులు రెండు జోన్లలో వ్యాపారం చేస్తున్నారని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అయినా ఇప్పుడు ఢిల్లీలో ఎటువంటి వ్యాపారాలు ఇప్పుడు జరగడం లేదన్నారు. తాను తన కుమారుడు రాఘవ ఏ వ్యాపారాల్లోనూ భాగస్వామిని కాదని తెలిపారు. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. లిక్కర్ డాన్, లిక్కర్ మాఫియా అంటూ తమ కుటుంబంపై ఆరోపణలను ఢిల్లీ మీడియా చేస్తుందన్నారు. మా బంధువులు కొందరు ఎనిమిది రాష్ట్రాల్లో లిక్కర్ వ్యాపారంలో ఉన్నది నిజమేనని, అది తమ కుటుంబం కాదని ఆయన చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో రాఘవ పోటీ....
2024లో ఒంగోలు ఎంపీగా తమ కుమారుడు రాఘవ పోటీ చేస్తారని తెలిపారు. తమ కుటుంబం ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చందని తెలిపారు. తన అన్న సుబ్బరామిరెడ్డి నుంచి తన వరకూ ఎన్నో ప్రజోపయోగమైన కార్యక్రమాలను చేశామని తెలిపారు. అయినా తమ కుటుంబంపై బురద జల్లడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తాము సమాధానాలిచ్చామని ఆయన తెలిపారు. తమ బంధువర్గంలో మాగుంట పేరు ఉండటంతో తమపై ఆరోపణలు వస్తున్నాయన్నారు. ఎవరైనా ఎప్పుడైనా ఈ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు.
Next Story