Mon Mar 31 2025 03:07:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి
నేడు ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరు కానున్నారు.

నేడు ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరు కానున్నారు. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో నేడు విచారణకు హాజరుకావాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్ లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయి రెడ్డిపై ఆరోపణలు రావడంతో విజయసాయిరెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.
కాకినాడ పోర్టు వ్యవహారంలో...
కర్నాటి వెంకటేశ్వర రావు అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచింది. పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఈ కేసుపై దర్యాప్తు ను ప్రారంభించింది. దర్యాప్తులో మనీలాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ ఈ మేరకు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story