Fri Dec 20 2024 19:11:05 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి వైసీపీ ప్లీనరీ
వైసీపీ ప్లీనరీ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఐదేళ్ల తర్వాత జరుగుతుండటంతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనేందుకు వచ్చారు
వైసీపీ ప్లీనరీ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ప్లీనరీ కావడంతో వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనేందుకు వచ్చారు. ప్లీనరీలో దాదాపు 9 రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. తొలి రోజు లక్షమంది ప్లీనరీకి వస్తారని అంచనా. ప్లీనరీ వేదికకు వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేశారు. దాదాపు 400 మంది వరకూ వేదికపై కూర్చునేలా సిద్ధం చేశారు.
తీర్మానాల పై చర్చ...
తొలి రోజు ఐదు తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. రేపు అధ్యక్ష ఎన్నిక ఉంటుంది. శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ను ఎన్నుకుంటారని చెబుతున్నారు. అనంతరం జగన్ ప్రసంగం ఉంటుంది. మొత్తం తొమ్మిది తీర్మానాలను ప్రవేశపెట్టి వాటిపై ఈ రెండు రోజులు చర్చించనున్నారు. ఒక్కొక్క తీర్మానంపై ఐదు వరకూ ప్రసంగించనున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ప్రసంగించనున్నారు.
Next Story