Fri Dec 20 2024 01:32:30 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : టీడీపీపై ఫైర్ అయిన విజయసాయిరెడ్డి
తెలంగాణ ఎన్నికలలో టీడీపీ వ్యవహార శైలిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండి పడ్డారు.
తెలంగాణ ఎన్నికలలో టీడీపీ వ్యవహార శైలిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండి పడ్డారు. ఆయన ట్వీట్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ర్యాలీలలో పచ్చ కండువాలు స్వైర విహారం చేస్తున్నాయంటే టోటల్ డ్రామాస్ పార్టీ (TDP) ఎటువంటి అపవిత్ర పొత్తులకైనా తెగించిందని అర్థమని చెప్పాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
సీపీఎం తోక పార్టీగా...
అలాగే ఇంగ్లీష్ మీడియం వల్ల ప్రయోజనం లేదని సీపీఎం నేత రాఘవులు అన్నారంటే తోక పార్టీల్లోనూ కుల, పెత్తందారీ, అహంకారం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చని ఆయన ట్వీట్ చేశారు. రాఘవులు ఇటీవల ఒక సమావేశంలో మాట్టాడుతూ చదువుకునే శక్తి ఉన్నవాళ్లు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడానికి జగన్ ప్రభుత్వం అప్పులు తీసుకువచ్చిందని ఆయన అన్నదానికి విజయసాయిరెడ్డి స్పందించారు.
Next Story