Mon Dec 23 2024 14:07:14 GMT+0000 (Coordinated Universal Time)
అత్యంత చెత్త ఆర్థిక మంత్రి ఆయనే
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ చరిత్రలో అత్యంత చెత్త ఆర్థిక మంత్రి అని అన్నారు. యనమలను ఒక కట్టప్పగా అభివర్ణించారు. యనమల రామకృష్ణుడు ఒక్క ఏడాదిలోనే 300 రోజులకుపైగా ఓవర్ డ్రాఫ్ట్ర్ వేస్ అండ్ మీన్స్ కు వెళ్లిన చరిత్రను సంపాదించుకున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.
టీడీపీ విధానాల వల్లనే....
గత ప్రభుత్వ విధానాలు, వైఖరి వల్లనే ఆర్థిక వనరుల కోసం తాము వెతుక్కోవాల్సి వస్తుందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాను పెద్ద మేధావిలాగా బిల్డప్ ఇస్తారని యనమలపై విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. యనమల ఒక నమ్మక ద్రోహి అని అన్నారు. ఆయనను ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని విజయసాయిరెడ్డి అన్నారు.
Next Story