Sun Dec 22 2024 18:13:45 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఎంపీ నన్ను చంపేస్తానన్నాడు
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తనను పార్లమెంటు హాలులో బెదిరించారని ఆయన చెప్పారు. తాను నిన్న పార్లమెంటు హాలులో ఒక సమావేశం ముగించుకుని బయటకు వస్తుండటగా గేట్ నెంబరు 4 వద్ద ఒరేయ్ నిన్ను మర్డర్ చేస్తా అని గోరంట్ల మాధవ్ బెదిరించారని రఘురామ కృష్ణరాజు మీడియాకు తెలిపారు.
ఫిర్యాదు చేస్తా....
దీనిపై తాను స్పందిస్తూ ప్రయత్నించమని చెప్పానని అన్నారు. ఈ ఘటనపై తాను స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు రఘురామ కృష్ణరాజు తెలిపారు. గోరంట్ల మాధవ్ తన భార్యను హత్య చేసినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు చూశానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అండతోనే తనను వైసీపీ ఎంపీలు బెదిరిస్తున్నారని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
Next Story