Mon Dec 23 2024 03:59:58 GMT+0000 (Coordinated Universal Time)
ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేస్తున్న వీడియోను విడుదల చేసిన వైసీీపీ
మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోను వైసీపీ విడుదల చేసింది
మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోను వైసీపీ విడుదల చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను విడుద చేసింది. మాచర్ల నియోజకవర్గంలో తుమ్మూరు కోట గ్రామంలో ఈవీఎంలను తెలుగుదేశం పార్టీ నాయకులు పులిపాటి నాగేశ్వరావు, తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్ బోయిన నరసింహారావు ధ్వంసం చేస్తున్న దృశ్యాలను పోస్ట్ చేసింది. కొన్ని గ్రామాల్లో వైసీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగిన దృశ్యాలను కూడా విడుదల చేసింది.
మాచర్ల నియోజకరవర్గంలో...
ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, కేవలం మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన వీడియోలను మాత్రమే విడుదల చేసిందని, టీడీపీ నేతలు అనేక పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డారని, ఈవీఎంలను ధ్వంసం చేశారని, అయినా ఎన్నికల కమిషన్ ఆ వీడియోలను విడుదల చేయలేదని వైసీపీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
Next Story