Sun Dec 22 2024 01:55:46 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎమ్మెల్యేకు కండువా కప్పిన వైఎస్ షర్మిల
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.
వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆర్ధర్ కు వైఎస్ షర్మిల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి ఆర్ధర్ వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే నియోజకవర్గంలో ఆయనకు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మధ్య పొసగలేదు. ఇరువురి మధ్య పంచాయతీ పీక్స్ కు చేరుకుంది. పలుమార్లు అధినాయకత్వం సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఇద్దరూ రాజీపడలేదు.
ఇద్దరికీ పొసగక...
దీంతో ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి గత మూడేళ్లుగా నందికొట్కూరులో రెండు గ్రూపులుగా ఉన్నారు. కానీ వైసీపీ ఈసారి ఎన్నికల్లో ఆర్ధర్ కు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆర్ధర్ వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్ధర్ నందికొట్కూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.
Next Story