Mon Dec 23 2024 07:44:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : సుప్రీంకోర్టులో వైసీపీకి షాక్.. పిటీషన్ ను తిరస్కరించిన ధర్మాసనం
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బతగిలింది. పోస్టల్ బ్యాలట్ విషయంలో జోక్యంచేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది
సుప్రీంకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బతగిలింది. పోస్టల్ బ్యాలట్ విషయంలో తాము జోక్యంచేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో తాము విభేదించలేమని పేర్కొంది. పోస్టల్ బ్యాలట్ పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరిగింది.
పోస్టల్ బ్యాలట్ పై...
పోస్టల్ బ్యాలట్ పై అధికారిక సీల్, స్పెసిమన్ సిగ్నేచర్ లేకున్నా ఆమోదించాలన్న ఎన్నికల కమిషన్ ఉత్తర్వులపై వైసీపీ అభ్యంతరం తెలిపింది. అయితే కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయలేమని హైకోర్టు తెలపడంతో వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో కూడా పిటీషన్ ను తిరస్కరించడంతో పోస్టల్ బ్యాలట్ వివాదానికి ముగింపు దొరికినట్లే. హైకోర్టు తీర్పుపై తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది.
Next Story