Mon Dec 23 2024 11:54:10 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అకౌంట్ ను హ్యాక్ చేసిన వారు క్రిప్టో కరెన్సీతో పాటు కోతి ఫొటోలను షేర్ చేశారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. వైసీపీ అకౌంట్ ను హ్యాక్ చేసిన వారు క్రిప్టో కరెన్సీతో పాటు కోతి ఫొటోలను షేర్ చేశారు. బయోలో ఎన్ఎఫ్టీ బిలియనీర్ అని పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీకి మద్దతుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ముందుకు వచ్చారన్న వార్తను కూడా ఇందులో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ జీ 20 సన్నాహక సదస్సులో మాట్లాడిన వార్తను కూడా జత చేశారు.
రంగంలోకి దిగిన టెక్నికల్ టీం...
ిఇందులో ఎక్కువగా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులే ఉన్నాయి. కవర్ పిక్ తో పాటు ప్రొఫైల్ పిక్చర్ ను కూడా దుండగులు మార్చేశారు. అయితే దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టెక్నికల్ టీం రంగంలోకి దిగింది. ట్విట్లర్ యాజమాన్యానికి కూడా ఫిర్యాదు చేసింది. తమ పార్టీ అధికార ట్విట్టర్ అకౌంట్ ను ఎవరు హ్యాక్ చేశారన్న దానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరి ప్రమేయం ఉందో తెలుసుకోవాలని కోరుతున్నారు.
Next Story