Mon Dec 23 2024 11:42:40 GMT+0000 (Coordinated Universal Time)
అన్న, తమ్ముడిపై వాలంటీర్ దాడి..
ఎంతో కాలంగా డబ్బులివ్వాలని అడుగుతున్నా కాలయాపన చేస్తున్నాడు తప్ప డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని, తనకు లోన్, ఇంటి..
యర్రగొండపాలెం : లోన్, ఇంటి స్థలం ఇప్పిస్తానని నమ్మబలికి వెంకటేశ్వర్లు నాయక్ అనే వ్యక్తికి చెందిన డ్రిప్ పైపులను స్థానిక వాలంటీర్ స్వామి నాయక్ అమ్ముకున్నాడు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని స్వామిని కోరగా ఎదురుదాడికి దిగాడు. అడ్డుకునేందుకు మధ్యలో వచ్చిన వెంకటేశ్వర్లు సోదరుడిపై కూడా దాడిచేశారు వాలంటీర్. అసలేం జరిగిందంటే.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మెట్టబోడు తండాలో వాలంటీర్ తనపై దాడి చేశాడని బాధితుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు చెందిన డ్రిప్పైపులను అదే ప్రాంతంలో వాలంటీర్‌గా పనిచేసే స్వామి నాయక్ అమ్ముకొని డబ్బులు ఇవ్వలేదని ఆరోపించాడు.
ఎంతో కాలంగా డబ్బులివ్వాలని అడుగుతున్నా కాలయాపన చేస్తున్నాడు తప్ప డబ్బులు మాత్రం ఇవ్వడం లేదని, తనకు లోన్, ఇంటి స్థలం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడని బాధితులు వాపోయారు. తమ నగదు తిగిరి ఇవ్వాలని వెంకటేశ్వర్లు నాయక్ ప్రశ్నించడంతో తనపై స్వామి నాయక్ దాడికి దిగాడని ఆవేదన వ్యక్తం చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన సోదరుడు అంజి నాయక్ పై దాడికి పాల్పడ్డాడని, ఈ ఘటనలో తన సోదరుడి తలకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ విషయంలో పోలీసులే తమకు న్యాయం చేయాలని, తమకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తే మళ్లీ స్వామినాయక్ జోలికి పోమని బాధితుడు పోలీసుల ముందు వాపోయాడు. మొత్తం మీద తనే డబ్బులిచ్చి తమపై దాడి చేయించుకున్నట్లైందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story