Mon Dec 23 2024 03:40:42 GMT+0000 (Coordinated Universal Time)
పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్య.. రాష్ట్రపతికి ఫిర్యాదు
పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో వైసీపీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది
పల్నాడులో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో వైసీపీ ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. పల్నాడు జిల్ల వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయిన ఘటనపై వైసీపీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని , తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
వెరీ బ్యాడ్ మార్నింగ్ అంటూ...
ఈ మేరకు వైసీపీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ట్వీట్ చేసింది. ‘‘ఆంధ్రప్రదేశ్లో ఇది వెరీ బ్యాడ్ మార్నింగ్ రాష్ట్రపతి మేడం. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రజలను కాపాడండి. అలాగే మాకు ప్రతి భారతీయుడి మద్దతు కావాలని కోరుతున్నాం’’ అని రాష్ట్రపతిని ట్యాగ్ చేస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.
Next Story